World's Most Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంకాంగ్

ప్రముఖ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్‌–‘2024 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాల్లో మార్పు లేదు.

ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్‌ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్‌ (స్విట్జర్లాండ్‌), న్యూయార్క్‌ సిటీ (యూఎస్‌), లండన్‌ (యూకే), నసావు (బహామాస్‌), లాస్‌ ఏంజిల్స్‌ (యూఎస్‌) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

మెర్సర్‌ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. 

Unhealthy Air: ప్రపంచంలోనే అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న‌దిదే..

అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాల్లోని నగరాలు టాప్‌–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్‌ 9వ స్థానంలో ఉన్నాయి. 

#Tags