H1B Visa Registration: హెచ్–1బీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ ఇదే, ముఖ్యమైన డాక్యుమెంట్స్..
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని వివరించింది.
Lakshya Sen: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో లక్ష్య సేన్‌కు 13వ ర్యాంక్
అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి.