Hyderabad Metro Phase II: రెండోదశ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ నవంబర్‌ 2వ తేదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌ మెట్రోరైలు రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది నగరానికి మరో కీలకమైన మైలురాయిగా నిలుస్తోంది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లను నిర్మించనున్నాయి. ముఖ్యంగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీ వరకు కొత్త ఆరో కారిడార్‌ను నిర్మించేందుకు రూ.8,000 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.

రెండో దశను 50:50 జాయింట్‌ వెంచర్‌గా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించనున్నారు. మొదటి దశ 69 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు ప్రపంచంలోనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అతి పెద్ద ప్రాజెక్టు. రెండో దశలో తెలంగాణ ప్రభుత్వానికి 30% (రూ.7,313 కోట్లు) వాటా, కేంద్ర ప్రభుత్వానికి 18% (రూ.4,230 కోట్లు), జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వాటా 48% (రూ.11,693 కోట్లు)గా ఉంటుందని అంచనా వేసారు.

ఫోర్త్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన డీపీఆర్‌ను తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త లైన్‌కి రూ.8,000 కోట్ల అంచనా వ్యయం ఉండగా, మొత్తం రెండో దశ ప్రాజెక్టుకు దాదాపు రూ.32,237 కోట్లు అయ్యే అవకాశం ఉంది.

Coromandel: కోరమాండల్‌ ఇంటర్నేషనల్ రూ.800 కోట్ల పెట్టుబడి

కొత్త హైకోర్టును కలుపుతూ మూడవ కారిడార్‌ రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సర్వేలు, నివేదికలు పూర్తి చేసి, ముఖ్యమంత్రి ఆమోదం పొందారు. తద్వారా.. హైదరాబాద్‌ మెట్రో వేగవంతమైన ప్రయాణానికి మరింత సమర్థవంతంగా మారబోతుంది.

మొదటి భాగంలో (పార్ట్‌-ఏ) ఐదు కారిడార్లు ఉన్నాయి. ఆ కారిడార్‌ల సమాచారం ఇదే..
కారిడార్‌ 4: నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిమీ పొడవులో.
కారిడార్‌ 5: రాయదుర్గ్‌ నుంచి కోకాపేట నియోపోలిస్‌ వరకు.
కారిడార్‌ 6: ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిమీ పొడవులో.
కారిడార్‌ 7: ముంబై హైవేపై మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకూ.
కారిడార్‌ 8: ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కిమీ పొడవులో.

Road Transport and Highways: తెలంగాణలో బైపాస్‌ నిర్మాణానికి రూ.516 కోట్లు.. ఏపీలో కూడా..

#Tags