RBI Latest Report: ప్రజల వద్ద ఉన్న డబ్బు రూ.30 లక్షల కోట్లు

ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 2022, అక్టోబరు 21 నాటికి గణనీయంగా పెరిగి రూ.30.88 లక్షల కోట్లకు చేరింది.

పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిన తర్వాత కూడా నగదు చలామణి భారీ ఎత్తున కొనసాగుతుండడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించిన 2016, నవంబరు 8 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాలు వెల్లడించాయి. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్ల ధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags