యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారతీయుడు?

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత్‌ స్వర్ణ పతకంతో ముగించింది.
పోలాండ్‌లోని కీల్స్‌లో ఏప్రిల్‌ 23న జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్‌ సచిన్‌ సివాచ్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్‌ సాబిర్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన టైటిల్‌ పోరులో సచిన్‌ 4–1తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కిది ఎనిమిదో స్వర్ణ పతకం. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్‌ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు.

పోలాండ్‌...
రాజధాని: వార్సా; కరెన్సీ: జొలోటి(Zloty)
పోలాండ్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రేజ్‌ దుడా
పోలాండ్‌ ప్రస్తుత ప్రధాని: మాటుస్జ్‌ మొరవిక్కీ

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 23
ఎవరు : సచిన్‌ సివాచ్‌
ఎక్కడ : కీల్స్, పోలాండ్‌










#Tags