వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్‌లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్?

వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ (డబ్ల్యూఆర్ఎస్) రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు.
మార్చి 7న ఇటలీలోని రోమ్‌ నగరంలో జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్‌ మంగోలియా రెజ్లర్‌ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. మరోవైపు భారత్‌కే చెందిన విశాల్‌ (70 కేజీలు) కాంస్యం సాధించాడు.

53 కేజీల విభాగంలో వినేశ్‌...
డబ్ల్యూఆర్‌ఎస్‌ టోర్నిలో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ విజేతగా అవతరించింది. రోమ్‌లో మార్చి 6న మహిళల ఫ్రీస్టయిల్‌ 53 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్‌ 4–0తో డయానా మేరీ హెలెన్‌ వెకర్‌ (కెనడా)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.

ఇటలీ రాజధాని: రోమ్‌; కరెన్సీ: యూరో
ఇటలీ ప్రస్తుత అధ్యక్షుడు: సెర్గియో మాటారెల్లా
ఇటలీ ప్రస్తుత ప్రధానమంత్రి: మారియో ద్రాగి

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : డబ్ల్యూఆర్‌ఎస్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలుపు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : బజరంగ్‌ పూనియా
ఎక్కడ : రోమ్, ఇటలీ











#Tags