ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన పీపుల్‌ క్లోజర్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?

కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రామచంద్రన్‌ రచించిన ‘బ్రింగింగ్‌ గవర్నమెంట్స్‌ అండ్‌ పీపుల్‌ క్లోజర్‌’ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మార్చి 20న వర్చువల్‌ విధానం ద్వారా ఆవిష్కరించారు.
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యకలాపాలను సౌకర్యవంతంగా, పారదర్శకంగా పొందాలని ప్రజలు భావిస్తారన్న రచయిత అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని, ఈ సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.

విదేశీ ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌
చరిత్రలో తొలిసారి విదేశాలకు చెందిన ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహంచనున్నారు. కోవిడ్‌–19 కారణంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌ను విదేశీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్‌ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి.

#Tags