తెలంగాణకు స్వచ్ఛత శక్తి పురస్కారం

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు స్వచ్ఛతా శక్తి పురస్కారాలు లభించాయి.
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి ప్రథమ బహుమతిని పొందగా, తమిళనాడు రాష్ట్రం ద్వితీయ బహుమతిని దక్కించుకుంది. హరియాణాలోని కురుక్షేత్రం గ్రామంలో ఫిబ్రవరి 12న జరిగిన స్వచ్ఛ శక్తి పురస్కారం అందజేత కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’లో భాగంగా ఇటీవల కేంద్ర బృందం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి డాక్యుమెంటరీ తీసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణకు స్వచ్ఛతా శక్తి పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కురుక్షేత్రం, హరియాణ




#Tags