తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు

అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది.
టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ‘ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’కు వెబ్‌సైట్ కేటగిరీలో అవార్డు లభించింది. ఇక ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా




#Tags