తెలంగాణ హెచ్చార్సీ తొలి చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రయ్య

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గుండా చంద్రయ్య డిసెంబర్‌ 23న బాధ్యతలు చేపట్టారు.
హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా మహ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. 2016, డిసెంబర్‌ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా జస్టిస్‌ సిస్సార్‌ అహ్మద్‌ కక్రూ పనిచేశారు. తదనంతరం కమిషన్‌ చైర్మన్‌ సభ్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్‌ ఏర్పాటైంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు కొనసాగుతారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ హెచ్చార్సీ తొలి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ గుండా చంద్రయ్య
ఎక్కడ : హైదరాబాద్‌




#Tags