టైమ్ శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ
గత శతాబ్దానికి సంబంధించి టైమ్ మేగజైన్ మార్చి 5న ప్రకటించిన ‘ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితా’లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్‌కు స్థానం లభించింది.
స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2న కపూర్తలా రాచకుటుంబంలో జన్మించారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె 1918లో స్వదేశానికి తిరిగొచ్చారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితమై, ఆయన బాటలో నడిచారు. వలస పాలన, సామాజిక దురాచారాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు విశేష కృషి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆమె పదేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల్లో ఇందిరా గాంధీ, అమృత్ కౌర్
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : టైమ్ మేగజైన్
#Tags