స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 దర్శనీయ ప్రదేశాలు?
స్వచ్ఛ ఐకానిక్ స్థలాలు–నాలుగో దశలో భాగంగా 12 దర్శనీయ ప్రదేశాలను ‘స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలు’గా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ చొరవతో ‘స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్’ కింద దేశంలోని గొప్ప వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను ‘స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలు’గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 ప్రదేశాలు...
స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 ప్రదేశాలు...
సంఖ్య | ప్రదేశం | రాష్ట్రం/యూటీ |
1 | గోల్కోండ | తెలంగాణ |
2 | అజంతా గుహలు | మహారాష్ట్ర |
3 | సాంచీ స్థూపం | మధ్యప్రదేశ్ |
4 | కుంభల్‌గఢ్ కోట | రాజస్తాన్ |
5 | జైసల్మేర్ కోట | రాజస్తాన్ |
6 | రామ్‌దేవ్రా | రాజస్తాన్ |
7 | కోణార్క్ సూర్య దేవాలయం | ఒడిశా |
8 | రాక్ గార్డెన్ | చండీగఢ్ |
9 | దాల్ సరస్సు | జమ్మూకశ్మీర్ |
10 | బాంకే బిహారీ ఆలయం(మధుర) | ఉత్తరప్రదేశ్ |
11 | ఆగ్రా కోట | ఉత్తరప్రదేశ్ |
12 | కాళీ ఘాట్ ఆలయం | పశ్చిమ బెంగాల్ |
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా 12 దర్శనీయ ప్రదేశాల ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు
#Tags