స్వచ్ఛ భారత్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
స్వచ్ఛభారత్‌లో తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచి ‘స్వచ్ఛభారత్ జాతీయ అవార్డు’ను కైవసం చేసుకుంది.
అలాగే జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేయనున్నారు.
మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు...
స్వచ్ఛ సుందర్ సముదాయిక్ సౌచాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్), సముదాయిక్ సౌచాలయ అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ), చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డీడీడబ్ల్యూఎస్) అనే మూడు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్ అవార్డుకు ఎంపిక చేశారు.
నాలుగు కేటగిరీల్లో అవార్డులు...
ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛ భారత్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలోనే

#Tags