స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ కంటే కరోనా వైరస్ 10 రెట్లు అధిక ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది.
కరోనా అనేది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని ఏప్రిల్ 13న తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలను ఒకేసారి కాకుండా, దశల వారీగా ఎత్తివేయడమే సరైందని సూచించింది. కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే శక్తివంతమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో చీఫ్ గా టెడ్రోస్ అధనామ్ ఉన్నారు.