సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ, సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేశారు.
అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ రెండు మైట్రోరైల్ ప్రాజెక్టుల కోసం రూ.17,000 వ్యయం చేయనున్నారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- దేశంలో 27 నగరాల్లో 1,000 కిలోమీటర్లకు పైగా మెట్రోరైల్ నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయి.
- ప్రస్తుతం వేర్వేరు రవాణా విధానాలైన బస్సులు, రైళ్లను అనుసంధానిస్తున్నాం.
- 2014 కంటే ముందు 10-12 ఏళ్లలో 225 కిలోమీటర్ల మేర మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది.
- 2014 తర్వాత ఆరేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అహ్మదాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ, సూరత్ మైట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
#Tags