శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎనర్జీ లీడర్ అవార్డు

ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి.
2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో ఎయిర్‌పోర్టు అవార్డులు పొందిందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు, ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ అవార్డుల విజేత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఎందుకు : ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్నందున
#Tags