స్మార్ట్ సిటీ వరల్డ్ కాంగ్రెస్‌కు ఎంపికై న ఏకైక భారత స్మార్ట్ సిటీ?

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్-2020 జరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో నవంబర్ 18న మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరం మూడో స్థానంలో నిలిచింది. విశాఖ బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్-2020కు ఎంపికైన ఏకైక భారత సిటీ
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : విశాఖపట్నం
ఎక్కడ : బార్సిలోనా, స్సెయిన్




#Tags