సీడబ్ల్యూసీ చైర్మన్‌గా ఆర్.కె.జైన్

కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ఆర్.కె.జైన్ నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో 2020 డిసెంబరు వరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా ఆర్.కె.జైన్ కొనసాగనున్నారు. సీడబ్ల్యూసీ ప్రస్తుత చైర్మన్ ఎ.కె.సిన్హా 2019, అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆర్.కె.జైన్ ఇప్పటివరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా బాధ్యతలు నిర్వహించారు. జైన్ స్థానంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖర్ అయ్యర్ ప్రభుత్వం నియమించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగానూ అయ్యర్ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : ఆర్.కె.జైన్



#Tags