రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను నెలకొల్పిన లెఫ్టినెంట్‌ కల్నల్‌?

భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అయిన భరత్‌ పన్నూ రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను తిరగరాశారు.

2020, అక్టోబర్‌లో అత్యంత వేగంగా ఒంటరిగా సైకిల్‌ తొక్కి కొత్త రికార్డు సృష్టించారని గిన్నిస్‌ అధికారులు 2021, ఏప్రిల్‌ 8న ధ్రువీకరించారు. 2020, అక్టోబర్‌ 10న లేహ్‌ నుంచి మనాలి వరకు 472 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్‌ తొక్కి రికార్డును నెలకొల్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను కలిపే ‘స్వర్ణచతుర్భుజి’రహదారిగా పేరొందిన రోడ్డు మార్గాన్ని 14 రోజుల 23 గంటల, 52 సెకన్లలో సైకిల్‌పై పూర్తిచేసి మరో కొత్త గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టారు.

#Tags