రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్‌కుమార్

భారత రైల్వే బోర్డు చైర్మన్‌గా, భారత ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు.
ఈ మేరకు డిసెంబర్ 31న ఉన్నతస్థాయి నియామకాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత చైర్మన్ అశ్వనీ లొహానీ స్థానంలో ఈవినోద్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

1982లో రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వినోద్‌కుమార్ రైల్వేతో పాటు భారత ప్రభుత్వ పరిశ్రమల శాఖ, రైల్ వికాస్ నిగమ్ వంటి సంస్థల్లో పనిచేశారు. 2017-18లో దక్షిణమధ్య రైల్వే రూ.13,673 కోట్ల రికార్డు ఆదాయం సాధించడంలో ఆయన విశేష కృషిచేశారు. 2018లో ఆరు ఎక్స్‌అఫీషియో అవార్డులు, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారాలను దక్షిణమధ్య రైల్వే అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రైల్వే బోర్డు చైర్మన్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : వినోద్‌కుమార్ యాదవ్
#Tags