రాధా దేవి, శాంతికి నారీ శక్తి పుర స్కారం
టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధా దేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు నారీ శక్తి పురస్కారం లభించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. 2018 ఏడాదికి గానూ మొత్తంగా మహిళా సాధికారతకు విశేష సేవలందిస్తున్న 41 మందికి, 3 సంస్థలకు నారీ శక్తి పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నారీ శక్తి పురస్కారం-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కగ్గనపల్లి రాధా దేవి, మున్నుస్వామి శాంతి
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : నారీ శక్తి పురస్కారం-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కగ్గనపల్లి రాధా దేవి, మున్నుస్వామి శాంతి
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా
#Tags