ఫిజీ సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ లోకూర్

ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్‌రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా భారత సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్(విశ్రాంత) మదన్ బి.లోకూర్ 2019, ఆగస్టు 12న ప్రమాణస్వీకారం చేశారు.
లోకూర్‌తో ఫిజీ అధ్యక్షుడు జియోజీ కొన్‌రోటే ప్రమాణస్వీకారం చేయించారు. ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్ మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఒక భారత జడ్జి మరోదేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ ఆయన పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్‌రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : ఆగస్టు 12, 2019
ఎవరు : జస్టిస్(విశ్రాంత) మదన్ బి.లోకూర్



#Tags