పట్టు గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణకి జాతీయ అవార్డు

దేశంలో అత్యధికంగా బైవోల్టిన్ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసినందుకుగాను తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 10న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ డెరైక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 40 ఏళ్లలో సాధించలేని ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించడం పట్ల పట్టుపరిశ్రమ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పట్టు గుడ్ల ఉత్పత్తిలో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : తెలంగాణ



#Tags