ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్‌లో భారత్‌కు కాంస్యం
కెన్యా రాజధాని నైరోబీలో జరుగుతున్న వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించింది. భారత బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి.
వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన జట్టు?
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్న భారత జట్టు
ఎక్కడ : నైరోబీ, కెన్యా
ఎందుకు : 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలవడంతో...

#Tags