నల్సా కార్యనిర్వాహక చైర్మన్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?

పోలీసుస్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సా ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

మానవ హక్కులు, అనైతిక ఉల్లంఘనలు పోలీసు స్టేషన్లలోనే ఎక్కువని పేర్కొన్నారు. నేషనల్‌ లీగల్‌ సర్వీ సెస్‌ అథారిటీ (నల్సా) ‘విజన్, మిషన్‌ స్టేట్‌మెంట్‌’, న్యాయసేవల మొబైల్‌ సేవల యాప్‌ను నల్సా కార్యనిర్వాహక చైర్మన్‌ జస్టిస్‌ యు.యు.లలిత్‌తో కలిసి ఆగస్టు 8న న్యూఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు. నల్సా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ద్వారా దేశంలోని న్యాయ సేవా సంస్థల నుంచి సెకన్ల వ్యవధిలో న్యాయ సహాయ దరఖాస్తును సమర్పించొచ్చని పేర్కొన్నారు.

క్విక్రివ్యూ :
ఏమిటి : నల్సా ‘విజన్, మిషన్‌ స్టేట్‌మెంట్‌’, న్యాయసేవల మొబైల్‌ సేవల యాప్‌ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సా ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలోని న్యాయ సేవా సంస్థల నుంచి సెకన్ల వ్యవధిలో న్యాయ సహాయ దరఖాస్తును సమర్పించేందుకు...

#Tags