నేషనల్ టెక్స్‌టైల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం
టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా రూ.1,480 కోట్లతో ‘నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్’ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. 2019, ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా
#Tags