ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా పేరు?

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది.
‘800’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మోషన్ పోస్టర్ అక్టోబర్ 13న విడుదలైంది. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో కనిపిస్తాడు.

మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్‌ను ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మురళీ బయోపిక్‌కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్‌లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ‘800’ అనే పేరుతో సినిమా నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్
ఎందుకు : శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా
#Tags