మొబైల్ ప్రీమియర్ లీగ్‌తో బీసీసీఐ అధికారిక ఒప్పందం
భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ప్రఖ్యాత స్పోర్టింగ్ కంపెనీ ‘నైకీ’ 15 ఏళ్ల బంధం అధికారికంగా ముగిసింది.
టీమిండియా కిట్ అండ్ మర్కండైజ్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్‌ట్స అపెరల్ అండ్ యాక్సెసరీస్తో బీసీసీఐ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇ-స్పోర్‌ట్స ప్లాట్‌ఫామ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)కు చెందినదే ఈ ఎంపీఎల్ స్పోర్‌ట్స. ఇకపై భారత సీనియర్ పురుషుల, మహిళల జట్లు, అండర్-19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్’ లోగో కనిపిస్తుంది.
మూడేళ్ల కాలానికి...
2020, నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా... 2023 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలానికి ఎంపీఎల్-బీసీసీఐ భాగస్వామ్యం కొనసాగుతుంది. టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి. ఐపీఎల్-2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఎంపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీసీసీఐతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఎంపీఎల్ స్పోర్ట్స్ అపెరల్ అండ్ యాక్సెసరీస్
ఎందుకు : టీమిండియా కిట్ అండ్ మర్కండైజ్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు

#Tags