మొబైల్ కాంగ్రెస్‌లో కేంద్ర టెలికం మంత్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 14న ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2019 సదస్సులో కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. 5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) 2018లో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
మూడు రోజుల(అక్టోబర్ 16 వరకు) పాటు జరగనున్న ఐఎంసీ సదస్సులో 500లకు పైగా కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2019 సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ

#Tags