మేఘాలకు కరెంటు షాక్ ఇచ్చి వాన కురిపించిన దేశం?
అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 2021, జూలై నెలలో మేఘాలకు కరెంటు షాక్ ఇచ్చి వర్షాన్ని కురిపించింది.
యూఏఈలోని దుబాయ్ నగరంలో గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణాన్ని కాస్త చల్లబరిచేందుకు ‘క్లౌడ్ సీడింగ్ (మేఘ మథనం)’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించాలిని దుబాయ్ వాతావరణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది దుబాయ్ నగరంలో కృత్రిమ వర్షాన్ని కురిపించింది.
డ్రోన్లతో షాకులిచ్చి..
మేఘ మథనంలో రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. మేఘాలపై కొన్ని రకాల రసాయనాలు, ఉప్పు వంటివి చల్లడం.. మేఘాలకు విద్యుత్ షాక్ ఇవ్వడం వంటివాటి ద్వారా వానలు పడే అవకాశం ఉంటుంది. ఇందులో దుబాయ్ అధికారులు కరెంటు షాక్ ఇచ్చే పద్ధతిని ఆచరించారు. పెద్దసైజు డ్రోన్ల సాయంతో మేఘాలకు విద్యుత్ షాక్ ఇచ్చారు. దానితో వర్షాలు కురిశాయి.
నీటి కరువును ఎదుర్కొనేందుకు..
యూఏఈలో వానలు చాలా తక్కువగా పడతాయి. ఏడాది సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు మాత్రమే. ఇటీవల మరింతగా తగ్గిపోతోంది. దీంతో దుబాయ్ ప్రభుత్వం 2017లోనే మేఘ మథనంపై దృష్టి సారించింది. రూ.112 కోట్ల (1.5 కోట్ల డాలర్ల)తో తొమ్మిది వేర్వేరు ప్రాజెక్టులకు చేపట్టింది. మేఘాలపై రసాయనాలు చల్లడం కాకుండా షాక్ ఇచ్చే పద్ధతిపై దుబాయ్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా డ్రోన్లను మేఘాలపైకి పంపి కరెంటు షాక్ ఇచ్చే ప్రాజెక్టును అమలు చేశారు.
షాక్‌తో వాన పడేదెట్లా?
మేఘాలు అంటే నీటి ఆవిరి దట్టంగా ఒకచోట కూడి ఉండటమే. వాటిలో నీటి ఆవిరి కణాలు దూరం దూరంగా ఉంటాయి. సాధారణంగా భారీగా మేఘాలు ఏర్పడినప్పుడు నీటి ఆవిరి ఎక్కువై బరువు పెరగడం, లేదా వాతావరణ పీడనంలో మార్పుల వల్ల మేఘాలపై ఒత్తిడి వల్ల వర్షం పడుతుంది. ఎండాకాలంలో ఈ పరిస్థితులు ఉండవు, మేఘాలు పెద్దగా ఏర్పడవు కాబట్టి వానలు కురవవు. ప్రస్తుతం దుబాయ్‌లో మేఘాలు వాటంతట అవే కురిసే పరిస్థితి లేక మేఘ మథనాన్ని ఆశ్రయించారు.
డ్రోన్లతో మేఘాలకు విద్యుత్ షాక్‌లు ఇచ్చినప్పుడు నీటి ఆవిరి కణాల్లో స్వల్పంగా అయస్కాంత శక్తి పుడుతుంది. దీని వల్ల నీటి ఆవిరి కణాలు ఆకర్షించుకుని కలిసిపోతాయి. తుంపర్లుగా, నీటి బొట్లుగా మారి వర్షం కురుస్తుంది. దుబాయ్‌లో జరిగింది ఇదే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేఘాలకు కరెంటు షాక్ ఇచ్చి వాన కురిపించిన దేశం?
ఎప్పుడు : జూలై నెల, 2021
ఎవరు : యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్
ఎక్కడ : దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్
ఎందుకు : అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడేకిన వాతావరణాన్ని కాస్త చల్లబరిచేందుకు...

#Tags