లీడింగ్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లి
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది ‘లీడింగ్ క్రికెటర్-2018’గా నిలిచాడు. ఈ మేరకు ఏప్రిల్ 10న విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ అవార్డులను ప్రకటించారు.
ఈ అవార్డును మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డాన్ బ్రాడ్‌మన్ (10 సార్లు), జాక్ హాబ్స్ (8 సార్లు) మాత్రమే గెలుచుకోగా...ఇప్పుడు ఆ జాబితాలో కోహ్లి చేరడం విశేషం. అలాగే విజ్డన్ ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కోహ్లి ఉండగా... ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బీమాంట్, జాస్ బట్లర్, స్యామ్ కరన్, రోరీ బర్న్స్‌లు మిగతావారు.
మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ‘లీడింగ్ క్రికెటర్’గా ఎంపికై ంది. మరోవైపు అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది ‘లీడింగ్ టి20 క్రికెటర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. విజ్డన్ సంస్థ 1889నుంచి ప్రతి ఏటా అత్యుత్తమ క్రికెటర్ అవార్డులను ప్రకటిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లీడింగ్ క్రికెటర్-2018
ఎప్పుడు : ఏప్రిల్10
ఎవరు : విరాట్ కోహ్లి

#Tags