కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది?
విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో రూ.122.90 కోట్ల వ్యయంతో నిర్మించే వరద రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు.
మార్చి 31న కనకదుర్గమ్మ వారధి వద్ద ఈ పనులకు సంబంధించిన ఫైలాన్‌ను ఆవిష్కరించారు. 1.5 కిలోమీటర్ల పొడవున కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు వరద రక్షణ గోడ నిర్మిస్తున్నారు.
హంసలదీవి వద్ద...
సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వర్’(మహారాష్ట్ర) వద్ద కృష్ణానది ఆవిర్భవించింది. ఇది కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూసీ నదులు కృష్ణా నదికి ముఖ్య ఉపనదులు. తుంగభద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి.. కర్నూలులోని సంగమేశ్వర్ వద్ద కృష్ణలో కలుస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన కృష్ణానది పాయలుగా చీలి హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. కృష్ణానది మొత్తం పొడవు 1400 కి.మీ..
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరద రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతం
ఎందుకు : వరదల నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని రక్షించేందుకు

#Tags