కోవిడ్-19 ఫండ్‌కు నేపాల్ 10 లక్షల డాలర్లు విరాళం
సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు నేపాల్ ప్రభుత్వం సుమారు 10 లక్షల డాలర్ల(10 కోట్ల నేపాలీ రూపాయలు) విరాళం ప్రకటించింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చలు
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. మార్చి 20న వీడియో లింక్ ద్వారా జరిపిన ఈ చర్చలు సందర్భంగా మోదీ మాట్లాడుతూ... కరోనా కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రులకు సూచించారు. చర్చల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌కు 10 లక్షల డాలర్ల విరాళం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : నేపాల్ ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్‌పై పోరుకు
#Tags