జస్‌ప్రీత్ బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ పురస్కారం
భారత సీనియర్ ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయ్ పురస్కారాలు లభించాయి.
ఉమ్రిగర్ అవార్డు
గత సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శన (మొత్తం 73 వికెట్లు)కు గాను పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇస్తారు. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల చెక్ అందజేశారు. ఇక దిలీప్ సర్దేశాయ్ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు. దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా, ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్ చేజిక్కించుకున్నాడు.
2018-19 బీసీసీఐ వార్షిక అవార్డులు
కృష్ణమాచారి శ్రీకాంత్: కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
అంజుమ్ చోప్రా: బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం (మహిళ; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
జస్‌ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు), దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ.2లక్షలు)
దిలీప్ దోషి: బీసీసీఐ ప్రత్యేక అవార్డు (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
చతేశ్వర్ పుజారా: దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక పరుగులు; ట్రోఫీ, రూ.2లక్షలు)
పూనమ్ యాదవ్: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
స్మృతి మంధాన: మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (ట్రోఫీ, రూ.2లక్షలు)
జులన్ గోస్వామి: మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు (ట్రోఫీ, రూ.2లక్షలు)
మయాంక్ అగర్వాల్: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (ట్రోఫీ, రూ.2లక్షలు)
షఫాలీ వర్మ: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (మహిళ; ట్రోఫీ, రూ.2 లక్షలు)
శివమ్ దూబే (ముంబై): లాలా అమర్‌నాథ్ (రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు).
నితీశ్ రాణా(ఢిల్లీ): లాలా అమర్‌నాథ్ (దేశవాళీ వన్డే క్రికెట్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు)
మిలింద్ కుమార్ (సిక్కిం): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు, రూ. 2.5 లక్షలు).
అశుతోష్ అమన్ (బిహార్): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ. 2.5 లక్షలు)
విదర్భ: ఉత్తమ దేశవాళీ జట్టు (మెమెంటో).
మాదిరి ప్రశ్నలు
1. 2018-19 సీజన్‌కు గాను బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?
1. స్మృతి మంధాన
2. జులన్ గోస్వామి
3. పూనమ్ యాదవ్
4. అంజుమ్ చోప్రా
- View Answer
- సమాధానం : 3
2. 2019 ఏడాదికిగాను కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం ఎవరు అందుకున్నారు?
1. కృష్ణమాచారి శ్రీకాంత్
2. అంజుమ్ చోప్రా
3. జస్‌ప్రీత్ బుమ్రా
4. దిలీప్ దోషి
- View Answer
- సమాధానం : 1, 2
#Tags