జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి?

జపాన్‌లో అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు.

పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో సుగా ఎంపికయ్యారు. సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: జపాన్ ప్రధాని షింజో అబే అరుదైన ఘనత
 
క్విక్ రివ్యూ :
ఏమిటి : జపాన్‌లో అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నూతన సారథిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : యోషిహిడే సుగా







#Tags