జాతీయ క్రీడా పురస్కారాలు-2019

2019 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులతోపాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ, రాష్టీయ్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు
రెజ్లర్ బజరంగ్ పూనియా, పారా అథ్లెట్ దీపా మాలిక్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నలభించింది. దీపా మాలిక్ వీల్‌చైర్‌లో తన అవార్డును స్వీకరించింది. దీంతో ఖేల్ రత్న అందుకున్న తొలి మహిళా పారా అథ్లెట్‌గా, అత్యధిక వయస్కురాలిగా దీపా నిలిచింది. రాజీవ్ ఖేల్ రత్న విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు బహుమానంగా అందిస్తారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

బజరంగ్ పూనియా

రెజ్లింగ్

2

దీపా మాలిక్

పారా అథ్లెటిక్స్


అర్జున అవార్డు
2019 ఏడాదికి మొత్తం 19 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందిస్తారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

భమిడిపాటి సాయిప్రణీత్

బ్యాడ్మింటన్

2

రవీంద్ర జడేజా

క్రికెట్

3

పూనమ్ యాదవ్

క్రికెట్

4

మొహమ్మద్ అనస్

అథ్లెటిక్స్

5

తజీందర్‌పాల్ సింగ్

అథ్లెటిక్స్

6

స్వప్న బర్మన్

అథ్లెటిక్స్

7

గుర్‌ప్రీత్ సింగ్ సంధు

ఫుట్‌బాల్

8

సోనియా లాథర్

బాక్సింగ్

9

చింగ్లెన్‌సానా సింగ్

హాకీ

10

ఎస్.భాస్కరన్

బాడీ బిల్డింగ్

11

అజయ్ ఠాకూర్

కబడ్డీ

12

అంజుమ్ మౌద్గిల్

షూటింగ్

13

ప్రమోద్ భగత్

పారా బ్యాడ్మింటన్

14

హర్మీత్ దేశాయ్

టేబుల్ టెన్నిస్

15

పూజా ధాండా

రెజ్లింగ్

16

ఫౌద్ మీర్జా

ఈక్వెస్ట్రియన్

17

సిమ్రన్ సింగ్ షెర్గిల్

పోలో

18

సుందర్ సింగ్ గుర్జర్

పారా అథ్లెటిక్స్

19

గౌరవ్ సింగ్ గిల్

మోటార్ స్పోర్ట్స్


ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

మొహిందర్ సింగ్ ధిల్లాన్

అథ్లెటిక్స్

2

సందీప్ గుప్తా

టేబుల్ టెన్నిస్

3

విమల్ కుమార్

బ్యాడ్మింటన్


ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

సంజయ్ భరద్వాజ్

క్రికెట్

2

రామ్‌బీర్ సింగ్ ఖోఖర్

కబడ్డీ

3

మెజ్‌బాన్ పటేల్

హాకీ


ద్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్)

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

మనోజ్ కుమార్

రెజ్లింగ్

2

లాల్‌రెమ్‌సంగా

ఆర్చరీ

3

అరూప్ బసక్

టేబుల్ టెన్నిస్

4

నితిన్ కీర్తనే

టెన్నిస్

5

మాన్యుయెల్ ఫ్రెడ్రిక్స్

హాకీ


రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్
  1. రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (మాంచో ఫై, అనంతపురం)
  2. గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (షూటింగ్)
  3. గో స్పోర్ట్స్ ఫౌండేషన్.

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).

బజరంగ్ గైర్హాజరు...
రాజీవ్ ఖేల్త్న్రకు ఎంపికైన భారత మేటి రెజ్లర్ బజరంగ్ పూనియా తన అవార్డును అందుకోలేకపోయాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల్లో భాగంగా అతను రష్యాలో ఉన్నాడు. వెస్టిండీస్‌లో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అథ్లెట్లు తజీందర్‌పాల్ సింగ్, మొహమ్మద్ అనస్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా గైర్హాజరయ్యారు.















#Tags