జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ - నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్)గా అజిత్ దోవల్‌ను కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నియమించింది.
ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కూడా తాజాగా కల్పించింది. 2014 మే 30న తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన దోవల్ పదవీకాలం మే 30న ముగిసింది. దీంతో మరోసారి ఎన్‌ఎస్‌ఏగా దోవల్‌ను నియమించామని జూన్ 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019, మే 31 నుంచి మొదలై వచ్చే ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది.
1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చేపట్టిన తొలి కీలక నియామకం ఇదే. వరుసగా రెండు పర్యాయాలు ఎన్‌ఎస్‌ఏగా నియమితులైన తొలి వ్యక్తి దోవలే. శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను అందుకున్న తొలి వ్యక్తి కూడా దోవలే. 1988లో మిజో తీవ్రవాద నాయకుడు లాల్‌డెంగాను చర్చలకు ఒప్పించడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) నియామకం
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : అజిత్ దోవల్

#Tags