ఇటీవల దేశవాళి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ క్రికెటర్?
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ దేశవాళి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పిన బెల్... 2020 ఏడాదితో దేశవాళి క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలకనున్నట్లు సెప్టెంబర్ 6న ప్రకటించాడు.
2004లో ఇంగ్లండ్ వన్డే, టెస్టు జట్లలో అరంగేట్రం చేసిన 38 ఏళ్ల బెల్... 161 వన్డేల్లో 5416 పరుగులు, 118 టెస్టుల్లో 7727 పరుగులు సాధించాడు. టెస్టు కెరీర్ కోసం 2015లోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన 38 ఏళ్ల బెల్... గాయాలతో టెస్టు జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున 2015లో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి దేశవాళి క్రికెట్ జట్టు వార్విక్‌షైర్‌తో ఉన్నాడు.బెల్ తన కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున 8 టి20లు ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవాళి క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవాళి క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్
#Tags