హైదరాబాద్‌లో హోగర్ కంట్రోల్స్ తయారీ

అమెరికాకు చెందిన స్మార్ట్‌హోమ్, బిల్డింగ్ ఆటోమేషన్ కంపెనీ హోగర్ కంట్రోల్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తయారీ యూనిట్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
దీని కోసం దేశీయ అనుబంధ సంస్థ అయిన హోగర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూన్ 26న వెల్లడించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హోమ్ ఆటోమేషన్‌కు అవసరమైన 11 రకాల ఉత్పత్తులను ఈ కేంద్రంలో, ఏటా 6 లక్షల యూనిట్ల మేర తయారు చేయవచ్చని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హోగర్ కంట్రోల్స్ తయారీ యూనిట్, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 26
ఎక్కడ : ఉప్పల్, హైదరాబాద్



#Tags