గూగుల్ సికామోర్ కంప్యూటర్ రూపకల్పన

దిగ్గజ సంస్థ గూగుల్‌కి చెందిన పరిశోధనా బృందం ‘సికామోర్ మెషీన్’ అనే నూతన కంప్యూటర్‌ను తయారుచేసింది.
సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన ఈ కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని అక్టోబర్ 23న తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అంటారు.

సికామోర్ మెషీన్-విశేషాలు
  • సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. సికామోర్‌లోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు.
  • సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్ క్యూబిట్స్ రూపంలో తీసుకుంటుంది.
  • సికామోర్‌లోని క్వాంటమ్ ప్రాసెసర్ 54 క్యూబిట్స్ సామర్థ్యంతో తయారైంది.


#Tags