ఏపీలో పోక్సో కోర్టు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన పోక్సో కోర్టు (ప్రత్యేక న్యాయస్థానం)ను ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ 2న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీకి ఎనిమిది పోక్సో కోర్టులు మంజూరయ్యాయని.. అందులో భాగంగా కృష్ణా జిల్లాకు ఒకటి మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో నమోదయ్యే మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణ పోక్సో కోర్టులో జరుగుతుందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీలో పోక్సో కోర్టు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణకు





#Tags