ఏపీ గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు

పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిలిపి వేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు కలిపి దాదాపు రూ. 3,710 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, అందులో 2018-19 ఏడాదికి సంబంధించి బేసిక్ గ్రాంట్ రూపంలో రూ. 870.23 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డెరైక్టరు బి.కుమార్ సింగ్ మార్చి 20న ఉత్తర్వులు జారీ చేశారు.
#Tags