బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ కన్నుమూత
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా(82) కన్నుమూశారు.
గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా బిహార్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. బిహార్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో ఆచార్యుడిగా విధులు నిర్వర్తించిన జగన్నాథ్ మిశ్రా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహరావు కాలంలో కేంద్ర మంత్రిగానూ సేవలందించారు. తొలుత కాంగ్రెస్‌లో చేరిన ఆయన తర్వాత ఎన్సీపీలో చేరారు. తర్వాత జేడీయూలోనూ కొంతకాలం కొనసాగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : జగన్నాథ్ మిశ్రా(82)
ఎందుకు : కేన్సర్ కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : జగన్నాథ్ మిశ్రా(82)
ఎందుకు : కేన్సర్ కారణంగా
#Tags