కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఈ మేరకు ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రసంగంలో కరోనాపై పోరును ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే ఆత్మనిర్భర భారత్ గురించి నొక్కి చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్ పెట్టకపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది. అత్యవసర సేవల రంగంలో పనిచేసిన వారందరూ తమ ప్రాణాలొడ్డి పనిచేశారు.విద్యుత్, వైద్యారోగ్యం, బ్యాంకింగ్, అగ్నిమాపక సిబ్బంది గొప్పగా పనిచేశారు. ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేయడం జరిగిందని ఆర్థక మంత్రి పేర్కొన్నారు.