బడ్జెట్ డెరైక్టర్‌గా నియమితులైన తొలి ఇండియన్-అమెరికన్?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై , త్వరలో బాధ్యతలు చేపట్టనున్న జో బెడైన్ తన పరిపాలనా బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.

కీలకమైన ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్, బడ్జెట్ డెరైక్టర్‌గా ఇండియన్-అమెరికన్ నీరా టాండన్(50), ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్(74) పేర్లను నవంబర్ 30న ఖరారు చేశారు. వీరు బెడైన్ ఆర్థిక బృందంలో సేవలందించనున్నారు.

తొలి ఇండియన్-అమెరికన్...
నీరా టాండన్, జానెట్ యెల్లెన్ నియామకాలకు అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేస్తే వీరు కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్, బడ్జెట్ డెరైక్టర్‌గా నియమితులైన తొలి శ్వేత జాతేతర మహిళగా, తొలి ఇండియన్-అమెరికన్‌గా నీరా టాండన్ రికార్డుకెక్కుతారు. అలాగే 231 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఆర్థిక విభాగాన్ని ముందుకు నడిపించే తొలి మహిళగా జానెట్ యెల్లెన్ గుర్తింపు పొందుతారు.

#Tags