అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్

దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ నిలిచారు.
కేరళ రాజధాని నగరం తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య డిసెంబర్ 28న బాధ్యతలు స్వీకరించారు. కాలేజ్ స్టూడెంట్, సీపీఎం కార్యకర్త అయిన ఆర్యతో కలెక్టర్ నవజ్యోత్ ఖోసా ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఆల్ సెయింట్స్ కాలేజ్‌లో ఆర్య బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమె స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం ఇదే ప్రథమం.

ఎల్‌డీఎఫ్ అభ్యర్థిగా పోటీ పడి తిరువనంతపురం మేయర్‌గా ఆర్య ఎన్నికయ్యారు. 100 మంది సభ్యుల కార్పొరేషన్‌లో ఆమెకు పలువురు ఇండిపెండెంట్లు సహా 54 మంది మద్దతిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 51, బీజేపీ 34, యూడీఎఫ్ 10, ఇతరులు 5 సీట్లు గెలుచుకున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా రికార్డు
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆర్య రాజేంద్రన్
ఎక్కడ : తిరువనంతపురం, కేరళ
#Tags