అర్జెంటీనా అధ్యక్షుడిగా అల్బెర్టో ఫెర్నాండెజ్
అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా అల్బెర్టో ఫెర్నాండెజ్, ఉపాధ్యక్షురాలుగా క్రిస్టీనా ఫెర్నాండెజ్ ఎన్నికయ్యారు.
అర్జెంటీనా అధ్యక్ష పదవికి అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఫెర్నాండెజ్ 48 శాతం ఓట్లు సంపాదించారు. అర్జెంటీనా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీపడినవారు పోలైన ఓట్లలో కనీసం 45 శాతం ఓట్లు సంపాదించాలి. ప్రస్తుత అధ్యక్షుడు మౌరిసియో మాక్రి 41 శాతం ఓట్లు మాత్రమే పొందాడు. దీంతో ఆల్బర్టో ఫెర్నాండెజ్ గెలుపు ఖాయమైంది. ప్రస్తుతం అర్జెంటీనా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాల్లో అర్జెంటీనా ఒకటి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అల్బెర్టో ఫెర్నాండెజ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అల్బెర్టో ఫెర్నాండెజ్
#Tags