అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాద సంస్థ?

అఫ్గానిస్తాన్‌ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది.

అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆగస్టు 15న అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్‌ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు.
 
అఫ్గాన్‌ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ప్రకటించారు. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు… అఫ్గానిస్తాన్‌ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పౌరులను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి.
 
ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌
అఫ్గానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాద సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు15
ఎవరు : తాలిబాన్
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో తమ పాలనను సాగించేందుకు...






#Tags