అంతర్జాతీయ క్రికెక్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్?

శ్రీలంక జట్టు ఓపెనర్, మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
తన 16 ఏళ్ల కెరీర్‌లో తరంగ 31 టెస్టుల్లో 1,754 పరుగులు (3 సెంచరీలు)... 235 వన్డేల్లో 6,951 పరుగులు (17 సెంచరీలు)... 26 టి20ల్లో 407 పరుగులు సాధించాడు. 2007, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్న 36 ఏళ్ల తరంగ 28 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
 
ఎడ్జ్‌కొనెక్స్‌తో అదానీ జాయింట్‌ వెంచర్‌...
దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అమెరికాకు చెందిన ఎడ్జ్‌కొనెక్స్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎడ్జ్‌కొనెక్స్‌లో భాగమైన ఎడ్జ్‌కొనెక్స్‌ యూరప్‌తో తమ అనుబంధ సంస్థ డీసీ డెవలప్‌మెంట్‌ చెన్నై (డీసీడీసీపీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్‌
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : శ్రీలంక జట్టు ఓపెనర్, మాజీ కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ




#Tags