ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : పి.సీతారామాంజనేయులు

మాదిరి ప్రశ్నలు








#Tags